హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాశ్ నగర్ ప్రాంతంలో అజయ్ కుమార్, అనిత దంపతులు నివాసముంటున్నారు. తమ ఇద్దరి పిల్లలతో శాపూర్నగర్లో ఉన్న ఏసియన్ పెయింట్స్ షాపులో భార్యకు ఉద్యోగం అడగడానికి తమ సొంత అటోలో వెళ్ళారు. షాపు ముందు ఆటో ఆపి భార్యాభర్తలు లోనికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేలో సరికి ఆటోలో చిన్న కుమారుడు అంబరీశ్(2) అటోలో కనబడలేదు.
చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అజయ్ కుమార్, అనితలు జీడిమెట్ల పీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, 4 బృందాలుగా విడిపోయి బాలుని కోసం గాలించారు. రెండు గంటలలోనే బాబు ఆచూకీని శాపుర్ నగర్లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.