ETV Bharat / jagte-raho

హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠా అరెస్ట్​ - rachakonda cp mahesh bhagawath

అంతర్​రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 76 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు.

Interstate cannabis gang arrested by rachakonda sot police
అంతర్​రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
author img

By

Published : Nov 30, 2020, 3:43 PM IST

సీలేరు మన్యం నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠాను.. రాచకొండ ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సీలేరు మన్యంలో మంగ అనే మహిళ నుంచి రమేశ్, మదన్ అనే వ్యక్తులు గంజాయి కొనుగోలు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ తెలిపారు. అరెస్టు చేసిన రమేశ్, మదన్​ల నుంచి 76 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అన్‌లాక్‌ తర్వాత మహిళల అక్రమ రవాణా మళ్లీ మొదలైందని మహేశ్​ భగవత్ తెలిపారు. ​మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏడుగురు నిందితులను ఎస్​ఓటీ బృందం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ముగ్గురు బంగాల్​ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. నిందితులకు సంబంధించిన ఐదు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయించినట్లు సీపీ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.