బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. ఓ వైపు శ్రావణి కుటుంబ సభ్యులు, సాయికృష్ణారెడ్డి వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందంటూ దేవరాజ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు దేవరాజ్ మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు, సాయి ప్రత్యారోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దేవరాజ్‌ను ఎస్ఆర్నగర్ పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. సాయికృష్ణారెడ్డిని శనివారం విచారించనున్నారు. సాయిని విచారిస్తే ఈ కేసులో కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
సెల్ఫీ వీడియో
దేవరాజ్, శ్రావణిల ఫోన్ సంభాషణలో దేవరాజ్‌ను శ్రావణి ప్రేమించినట్లుగా పోలీసులు గుర్తించారు. తాజాగా బయటకు వచ్చిన శ్రావణి వీడియోలు కూడా సేకరించారు. గతంలో దేవ్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా శ్రావణి అతడికి వీడియో సందేశాలు పంపింది. నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి అని.. ఎంత మంది పరిచయమైనా నువ్వు మాత్రమే స్పెషల్ అంటూ వీడియోలో చెప్పింది. తాను ఎక్కడున్నా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తానని వీడియో పంపింది.
దేవరాజ్‌కు సాయి కృష్ణా రెడ్డికి వాగ్వాదం
శ్రావణి ఈ నెల 7న దేవరాజ్‌తో కలిసి పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇది గమనించిన సాయి అక్కడికి వెళ్లాడు. రెస్టారెంట్‌లోనే శ్రావణిని సాయి కొట్టాడని దేవరాజ్ పోలీసులకు వివరించాడు. ఆ రెస్టారెంట్ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతరం శ్రావణి ఇంట్లో దేవరాజ్ విషయమై గొడవ జరిగింది. ఇంట్లో సాయి తనని కొడుతున్నాడని, కుటుంబ సభ్యులు తిడుతున్నారని... దేవరాజ్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఇంట్లో జరుగుతున్న గొడవను దేవరాజ్‌కు కాల్ చేసి వినిపించింది. ఆదే కాల్‌లో దేవరాజ్‌కు సాయి కృష్ణా రెడ్డికి వాగ్వాదం జరిగింది.
కేసు పెట్టింది.. క్షమాపణ చెప్పింది
గతంలో దేవరాజ్‌పై శ్రావణి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. అప్పుడు శ్రావణి.. దేవరాజ్ తన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని డబ్బులు డిమాండ్ చేశాడని... అత్యాచారం కూడా చేయబోయాడని పెట్టిన కేసుతో జైలుకు వెళ్లాడు. విడుదలైన తర్వాత అతనికి శ్రావణి క్షమాపణ చెప్పింది. మళ్లీ వీళ్లిద్దరూ కలుసుకున్నారు. అప్పడు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా, అతనిపై కేసు పెట్టినా.. శ్రావణి దేవరాజ్‌తో సంబంధాలు కొనసాగించింది. కుటుంబ సభ్యులకు, సాయికి తెలియకుండా దేవరాజ్‌ను శ్రావణి కలిసేది.
నిర్మాతను కూడా విచారించనున్నారు
ఈ కేసులో సాయికృష్ణ, దేవరాజ్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇద్దరినీ ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి పోలీసులు శనివారం విచారించనున్నారు. ఇప్పటి వరకూ బయటికి వచ్చిన ఆడియోల్లో వాస్తవాలను పరిశీలించి, వీరిద్దరితో పాటు ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని కూడా విచారించనున్నారు.
ఇదీ చదవండి: అరెస్ట్ చేయించింది... విడుదలయ్యాక మళ్లీ క్లోజ్‌గా ఉంది