ETV Bharat / jagte-raho

విషాదం: కారు ఢీకొని వలస కార్మికుడు మృతి - warangal urban crime news

కారు ఢీకొని ఓ వలస కార్మికుడు మృతి చెందిన ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

immigrant-labour-died-in-road-accident-in-warangal-urban-district
విషాదం: కారు ఢీకొని వలస కార్మికుడు మృతి
author img

By

Published : Sep 25, 2020, 12:37 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లోని పాలడైరీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొని కామేష్​ అనే వలస కూలీ మృతి చెందాడు.​

మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన కామేష్​ భీమదేవరపల్లిలో కొత్తగా నిర్మిస్తోన్న కస్తూర్భా గాంధీ పాఠశాల భవన నిర్మాణ పనుల్లో కార్మికునిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నిత్యావసర సరుకుల కోసం ముల్కనూర్​కు వచ్చి తిరిగి వెళ్తుండగా.. పాలడైరీ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు కామేష్​ను వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన కామేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గోదావరిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.