ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. అందులో నుంచి 72కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మహబూబాబాద్‌కు చెందిన పల్తియాకు చెందిన శంకర్, వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. చింతూరు సరిహద్దు ప్రాంతం నుంచి విక్రయించి రవాణా చేస్తున్నట్టు వారు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు