వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో అక్రమ గుడుంబా తయారీ గుట్టుగా సాగుతూనే ఉంది. కొందరు అక్రమార్కులు ఆబ్కారీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా బెదరడం లేదు. యథేచ్ఛగా స్థావరాలు నెలకొల్పి గ్రామాల్లో, తండాల్లో విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. తాజాగా వర్ధన్నపేట మండల పరిధిలో 250 కిలోల బెల్లాన్ని అధికారులు సీజ్ చేశారు.
వర్ధన్నపేటలోని రుక్కీ తండా, దుబ్బతడలకు బెల్లం, నాటుసారా, పటిక సరఫరా చేస్తున్నరానే సమాచారంతో ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. బెల్లం, నాటుసారా అక్రమంగా సరఫరా చేస్తున్న అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 250 కిలోల బెల్లంతో పాటు ఓ ఆటోను అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.