ETV Bharat / jagte-raho

నకిలీ గన్​మెన్​ అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్​ రేతిబౌలిలో నివాసముంటున్న సంతోష్​ జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం నకిలీ పోలీస్​గా అవతారమెత్తాడు. తాను ముఖ్యమంత్రికి గన్​మెన్​ అంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్న ఇతన్నీ పోలీసులు గస్తీ కాసి అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి సఫారీ డ్రెస్సు, బొమ్మ తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డు, రూ. 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

hyderabad police arrested fake gunmen person of cm kcr
నకిలీ గన్​మెన్​ అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Nov 7, 2020, 10:01 PM IST

తాను పోలీస్​ శాఖలో ఎస్సైనని.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు గన్​మెన్​ అంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్న ఘరానా మోసగాడిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​ రేతిబౌలి ఇందిరానగర్​కు చెందిన నందికొండ సంతోష్​ ఇంటర్మీడియట్​ వరకు చదువుతున్నాడు. కొంతకాలం ఎలక్ట్రిషీయన్, ఆ తర్వాత కారు డ్రైవర్​గా పనిచేశాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం నకిలీ పోలీస్​గా అవతారమెత్తాడు. పోలీస్​ శాఖలో ఎస్సైగా పనిచేస్తున్నట్లు, సీఎం కేసీఆర్​ వద్ద ప్రగతిభవన్​లో గన్​మెన్​గా పనిచేస్తున్నట్లు పలువురిని నమ్మించారు.

న్యాయశాఖలో ఒప్పంద ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితులు.. అతనిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోష్​పై నిఘా ఉంచి.. ఇంట్లో ఉన్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి సఫారీ డ్రెస్సు, బొమ్మ తుపాకీ, ఎస్సై నకిలీ గుర్తింపు కార్డు, రూ. 25 వేలు స్వాధీనం చేసుకుని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.