జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. కోటి అరవై లక్షలు తీసుకొని నిలువునా ముంచారని స్థిరాస్తి వ్యాపారి రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013లో బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం పేరుతో విడతలవారీగా కోటి అరవై లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. పారిశ్రామికవేత్త జయరాంకు అప్పు ఇచ్చే స్థాయి రాకేశ్‌కు లేదని అభిప్రాయపడ్డారు. మోసం చేసి వసూలు చేసే డబ్బులను క్రికెట్ బెట్టింగ్, కెసినోలో పెట్టడం రాకేశ్ వ్యసనం అని రాజ్ కుమార్ తెలిపారు. కొంతమంది వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకువచ్చి... జయరాంకు ఇచ్చారని వార్తలు వస్తున్న తరుణంలో రాజ్ కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బయటకొస్తున్న రాకేశ్‌రెడ్డి బాధితులు - శిఖా
జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమ వద్ద కోట్లు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.