ETV Bharat / jagte-raho

ప్రశ్నించినందుకు భార్యపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన భర్త - పీ అండ్ టీ కాలనీలో భార్యపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన భర్త

కరోనా నిబంధనలు సడలించినప్పటికీ పనికి వెళ్లకుండా ఖాళీగా ఉంటున్నావని ఓ భార్య తన భర్తను ప్రశ్నించింది. దీంతో పగ పెంచుకున్న భర్త ఆమెపై పెట్రోల్​ పోసి తగులబెట్టాడు. తీవ్రంగా గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

husband poured petrol on on fire his wife for questioning at p&t colony saroornagar
ప్రశ్నించినందుకు భార్యపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన భర్త
author img

By

Published : Oct 12, 2020, 8:58 PM IST

హైదరాబాద్ సరూర్‌నగర్‌ పరిధి మైత్రీనగర్​లో ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలకు చెందిన వెంకన్న, సుభద్ర దంపతులు. జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి పీ అండ్ టీ కాలనీ మైత్రీనగర్‌లో నివాసముంటున్నారు. వెంకన్న కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు.

కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ పనికి పోకుండా ఇంటివద్దనే ఉండడం వల్ల భార్య మందలించింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త బైక్​లో నుంచి పెట్రోల్‌ తీసి ఆమె పడుకున్న సమయంలో చల్లి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి : బాలికకు ఏడో నెలలోనే ప్రసవం చేసిన తల్లి... తల్లీశిశువు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.