వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భారీ మొత్తంలో అంబర్, జర్దా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 3 లక్షల 11 వేల రూపాయలు ఉంటుందని వారు పేర్కొన్నారు. హన్మకొండకు చెందిన కిరాణాషాపు యజమాని వినయ్ కుమార్ కారులో హైదరాబాద్ నుంచి గుట్కా ప్యాకెట్లు దిగుమతి చేసుకుంటున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. తనిఖీల్లో భాగంగా కారులో ఉంచిన 6 బ్యాగుల అంబర్ ప్యాకెట్లు, 38 వీ1 జర్దా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
వినయ్‌కుమార్ తన మిత్రుడు ఎకాంబరంతో కలిసి హైదరాబాద్‌కు చెందిన కేకే బజాజ్ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో గుట్కా దిగుమతి చేస్తున్నాడు. వాటిని నగరంలోని దుకాణాల్లో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక కారు, ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి : 'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'