భాగ్యనగరంలో భారీ మొత్తంలో గుట్కా పట్టుబడింది. అక్రమంగా నిల్వచేసిన భారీగుట్కాను పట్టుకున్నట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. గగన్‌పహాడ్‌లో గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రోడక్ట్స్‌లో పాన్ మసాలాలకు సంబంధించిన రూ.కోటి 25 లక్షల విలువైన ముడి సరకును స్వాధీనం తెలిపారు. ఏజెన్సీలకు అక్రమ నిల్వలపై హెచ్చరికలు జారీ చేశారు.
గోవా మసాలా పేరుతో ఉత్పత్తులు తయారు చేస్తున్న జె.ఎం.జోషి, సచిన్ జోషిపై ట్రేడ్ మార్క్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మానిక్‌చంద్ యజమాని సురేశ్ ఫిర్యాదు చేశారు. 7 హిల్స్ మానిక్‌చంద్ బ్రాండ్‌ను ఉపయోగించుకొని గుట్కా తయారుచేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
ఇదీ చదవండి: రాయినిగూడెంలో విషాదం... నీటిలో గల్లంతైన యువకుడు మృతి