నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన కార్తీక అనే మహిళకు పెళ్లై కూతురు ఉంది. భర్తతో విడాకులు కావడం వల్ల బాసరలోనే ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో అక్కడే నివాసముంటున్న సురేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఫలితంగా ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కార్తీక గర్భం దాల్చింది. దీంతో సురేశ్ బంధువులు గర్భాన్ని తీయించుకోవాలంటూ కార్తీకతో గొడవ పడ్డారు. మనస్థాపానికి గురైన కార్తీక.. తన కూతురుతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో అక్కడ ఉన్న పోలీసులు కార్తీక ఏడవడాన్ని గమనించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కార్తీక, సురేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీచూడండి: దారుణం.. ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం