తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానంటూ యువకుడు కత్తిలో దాడి చేశాడంటూ ఓ యువతి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని పెజ్జోనిపేటలో నివాసముంటున్న యువతి ఓ సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. అక్కడే అవుట్ సోర్సింగ్ మెకానిక్‌గా పని చేస్తున్న ఎం. అజయ్‌కుమార్ అనే వ్యక్తి రెండు నెలలుగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని యువతి తెలిపింది.
యువతికి ఈ మధ్యే వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. అది తెలిసిన అజయ్‌కుమార్ సోమవారం మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని... లేకపోతే చంపేస్తానంటూ కత్తితో ఆమెపై దాడికి యత్నించగా యువతి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఉన్నతాధికారిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయటం పట్ల అజయ్ సహోద్యోగులు విస్మయానికి గురయ్యారు.
ఇదీ చూడండి: పెద్దపులి దాడిలో యువకుడు మృతి.. భయాందోళనలో స్థానికులు