ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం పట్టివేత - శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం

బంగారం తరలించే దుండగులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్​ విమానాశ్రయంలో క్యాప్సుల్స్​ రూపంలో అరకిలో పుత్తడి తరలిస్తూ పట్టుబడ్డారు.

half kg gold Seizure in shamshabad airport hyderabad
అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారం పట్టివేత
author img

By

Published : Nov 28, 2020, 11:06 PM IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అతనిని తనిఖీ చేయగా బంగారంతో కూడిన మూడు క్యాప్సిల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. నల్లటి క్యాప్సిల్స్‌ రూపంలో ఉన్న మూడింటిని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రూ.24.49 లక్షల విలువైన 505.53 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ దొంతిరెడ్డి గోపి తెలిపారు.

ఇదీ చూడండి : కొలువు కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.