కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గోద్మేగాం వద్ద రూ.1.10 లక్షల విలువ చేసే గుట్కా తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రాత్రి వేళలో తనిఖీలు చేపట్టి... గుట్కాని స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక బీదర్ నుంచి బోధన్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: గూడూరులో 252కేజీల గంజాయి స్వాధీనం