వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది సభ్యులు గల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్, ఆగ్రాకు చెందిన వీరంతా... ఎలక్ట్రీషియన్లుగా చెప్పుకుని బిల్డర్ల వద్ద పనిలో చేరుతున్నారు. పగలంతా వెంచర్లలో పనులు చేస్తూ... రాత్రిపూట అక్కడి నిర్మాణ సామగ్రి, వైర్లు, ఎలక్ట్రిక్ వస్తువులు చోరీ చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతుందని... ఇటీవల ఓ వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిందితుల నుంచి 51 లక్షల విలువైన సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ చెప్పారు.
ఇదీ చదవండి: పోలీసుల అదుపులో ఎల్లమ్మ ఆలయం చోరీ నిందితుడు