ETV Bharat / jagte-raho

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి - accidents jagityal district

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న టిప్పర్‌ వారి పాలిట మృత్యుపాశంగా మారింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టగా నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు మృతిచెందగా బంధువుల రోదనలు మిన్నంటాయి.

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

author img

By

Published : Nov 9, 2020, 5:26 AM IST

జగిత్యాల- నిజామాబాద్‌ జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ తన బావమరిది చంద్రమోహన్‌ను దుబాయ్‌ పంపేందుకు... రెండు కుటుంబాల సభ్యులు కారులో బయల్దేరారు.

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు...

జగిత్యాల బస్టాండులో చంద్రమోహన్‌ను బస్సెక్కించి తిరుగు ప్రయాణమయ్యారు. కోరుట్ల మండలం వెంకటాపూర్‌ వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని అతివేగంతో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ భార్య లత అక్కడికక్కడే మృతిచెందింది. చంద్రమోహన్ భార్య, కుమారుడు జగిత్యాల ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించిన చిన్నారి అక్కడే ప్రాణాలు వదిలేసింది.

మొత్తం ఏడుగురు...

దుబాయ్‌కి వెళ్లేందుకు బస్సెక్కిన చంద్రమోహన్‌ ప్రమాద విషయం తెలుసుకుని తిరిగి వచ్చారు. భార్య, పిల్లలు, చెల్లెలు చనిపోయేసరికి ఆస్పత్రి వద్ద కూప్పకూలిపోయారు. ప్రమాద సమయంలో కారులో మెుత్తం ఏడుగురు ప్రయాణించారు. నలుగురు మృతిచెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనా స్థలం పరిశీలన...

ఘటనా స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర రాజు పరిశీలించారు. వేగంగా వస్తున్న కారు ముందు ఉన్న లారీని గమనించకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోవడం... అందులో ఇద్దరు చిన్నారులు ఉండడం తీవ్రంగా కలిచివేసింది.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో నిజామాబాద్‌ జవాన్‌ వీరమరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.