ETV Bharat / jagte-raho

తాత, ముగ్గురు మనవళ్లను మింగేసిన చెరువు

పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లిన ముగ్గురు మనవళ్లు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తాత, ముగ్గురు మనవళ్లను మింగేసిన చెరువు
author img

By

Published : May 5, 2019, 1:02 PM IST

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదం చోటు చేసుకుంది. గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన తాత, ముగ్గురు మనవళ్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం కొలనూరు చెరువులో ఈత కొట్టేందుకు పాతూరు రాజయ్య తన ముగ్గురు మనువళ్లను తీసుకెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో నలుగురూ మునిగిపోయారు. శనివారం రాత్రి రాజయ్యతో పాటు మనవడు సిద్ధార్థ మృతదేహం వెలికి తీయగా ఇవాళ ఉదయం మరో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తాత, ముగ్గురు మనవళ్లను మింగేసిన చెరువు

ఇవీ చూడండి: రైతన్నలకు జాయింట్‌ కలెక్టర్‌ భరోసా

ఫైల్: TG_KRN_41_05_FOUR DEATH_AV_C6 రిపోర్టర్: లక్ష్మణ్,8008573603 సెంటర్: పెద్దపల్లి జిల్లా కెమెరా: పర్సనల్ –--------------- () పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం కొలనూరు చెరువులో ఈత కొట్టేందుకు పాతూరు రాజయ్య తోపాటు తన ముగ్గురు మనవాళ్లు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయ్యారు. ఈనేపథ్యంలో శనివారం రాత్రి రాజయ్యతోపాటు మనవడు సిద్ధార్థ మృతదేహం వెలికి తీయగా ఈరోజు ఉదయం మరో ఇద్దరు మనవళ్లు ఆదర్శ, లిట్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డి సి పి సుదర్శన్ గౌడ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.