అప్పుల బాధతో పురుగుమందు తాగి రైతు బలవన్మరణం చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా లేకపోవడం వల్ల మనస్తాపం చెందిన మల్లికార్జున రావు... పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మనోవేదనతో బాధపడుతున్న మల్లికార్జునరావు ఉదయాన్నే పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోగా... కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'జీరో అవర్లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!'