ETV Bharat / jagte-raho

అటవీ ప్రాంతంలో లైసెన్స్ తుపాకులతో వేట

జకోరా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఐదుగురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్​ చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి.. వారి నుంచి రెండు తుపాకులు, కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు లైసెన్స్ తుపాకులతో హైదరాబాద్ నుంచి వచ్చినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాబీబ్​ఖాన్ తెలిపారు.

Forest officials arrested five poachers in a forest area of Zakora village
అటవీ ప్రాంతంలో లైసెన్స్ తుపాకులతో వేట
author img

By

Published : Dec 21, 2020, 7:26 AM IST

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జకోరా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడుతూ ఐదుగురు వేటగాళ్లు పట్టుబడ్డారు. జకోరా గ్రామంలోని అఫది ఫారం రైస్ మిల్​లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాబీబ్​ఖాన్ పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రెండు విదేశీ తుపాకులు, ఒక కారు, కుందేలు మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తరుచుగా కుందేళ్లు, అడవి పందులను వేటాడుతున్న వీరు.. లైసెన్స్ తుపాకులతో హైదరాబాద్ నుంచి వచ్చినట్లు హాబీబ్​ఖాన్ తెలిపారు. ఈ ఐదుగురిని అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.