హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చోరీ జరిగింది. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయంలో ఉంచిన ట్రోఫీలు మాయమయ్యాయి. కరోనా వల్ల గత నెలలో అసోసియేషన్ కార్యదర్శి జీపీ.. కార్యాలయానికి తాళం వేశారు. 20 రోజుల తర్వాత మంగళవారం వెళ్లి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. దొంగలు పడ్డారనే అనుమానంతో లోపలికి వెళ్లి చూస్తే... ట్రోఫీలు ఉన్న కప్బోర్డు పగులగొట్టి కనిపించింది.
కప్బోర్డులోని ఒక వెండి, 15 ఇత్తడి ట్రోఫీలు మాయమవ్వడం గమనించిన కార్యదర్శి జీపీ.. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- ఇదీ చూడండి : మహేంద్రసింగ్ ధోనీపై పాక్ క్రికెటర్ల ప్రశంసలు