మల్లాపూర్ అపోలో టైర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. గోకుల్ నగర్‌లో ఉన్న ఈ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.
మూడు గంటలు గడిచినా..
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి మూడు గంటలు గడిచినప్పటికి మంటలు అదుపులోకి రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. సుమారు 10 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:'పోడు రైతులను ఇబ్బంది పెడితే బాగోదు'