నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రం సమీపంలో బొలెరో వాహనంలో పశుగ్రాసం తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నిప్పులు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురిని కాపాడారు.
ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.4.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: 120 కిలోల గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్