ETV Bharat / jagte-raho

బీరప్పనగర్​లో 32 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి - తెలంగాణ తాజా వార్తలు

బీరప్పనగర్​లోని ఓ ద్విచక్రవాహన షోరూమ్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 32 వాహనాలు దగ్ధమయ్యాయి. ఓ ఎలక్ట్రిక్ వాహనం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

fire-accident-at-bike-show-room-in-medchal-malkajigiri-district-news
ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి!
author img

By

Published : Jan 15, 2021, 8:50 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పరిధి బీరప్పనగర్​లోని ఓ ద్విచక్రవాహన షో రూమ్​లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో 32 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు రోజుల క్రితం దుకాణ యజమాని యాదగిరి ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారు. 13న షోరూమ్ మూసేశారు.

గురువారం తెల్లవారుజామున దుకాణం లోపల నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు గమనించారు. యజమానికి సమాచారమిచ్చారు. అప్పటికే 32 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

fire-accident-at-bike-show-room-in-medchal-malkajigiri-district-news
దగ్ధమైన వాహనాలు

ఇదీ చదవండి: విషాదం: పతంగి ఎగురవేస్తూ బాలుడు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.