వరప్రసాద్- పద్మజ దంపతులు.. ఫైనాన్స్ బిజినెస్ పేరుతో భాగ్యనగరంలో అక్రమాలకు పాల్పడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్స్ చేస్తున్నామని... తమ దగ్గర పెట్టుబడి పెట్టడితే 10 శాతం వడ్డీ ఇస్తానని నమ్మబలికారు. వారి మాయమాటలను నమ్మిన రహమత్నగర్, మోతీనగర్, శ్రీనగర్ కాలనీకి చెందిన పలువురి నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేశారు.
తన వద్ద డబ్బులు తీసుకుని అసలు, వడ్డీ ఇవ్వకపోవడం వల్ల విజయ లక్ష్మి అనే మహిళ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆధిపత్య పరుగులో చైనా... ఆయుధ అన్వేషణలో భారత్