ETV Bharat / jagte-raho

రజక్​పల్లిలో అప్పుల బాధతో రైతు బలవన్మరణం

ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయి... పంటలు బాగా పండుతాయనే ఆశతో అప్పులు తెచ్చాడు ఓ రైతు. తనకున్న రెండెకరాల పొలంలో సన్నరకం వరి, పత్తిని సాగు చేశాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో భారీ వర్షాలు వచ్చాయి. ఏపుగా పెరిగిన పత్తి కాస్తా కుళ్లిపోయింది. మరోవైపు సన్నరకం వరికి దోమపోటు వచ్చింది. ఫలితంగా అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

farmer suicide due to crop loss in medak district
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
author img

By

Published : Nov 14, 2020, 10:44 AM IST

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజక్​పల్లిలో చోటు చేసుకుంది. రేగుల మహంకాళి అనే రైతు తనకున్న రెండెకరాల భూమిలో అప్పులు చేసి సన్నరకం వరి, పత్తి వేశాడు. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరగగా... సన్న రకం వరికి దోమ పోటు వచ్చి పూర్తిగా నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే పంట పూర్తిగా పాడవగా... మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని ఎస్సై ప్రకాశ్ గౌడ్ తెలిపారు.

మృతుని భార్య గౌరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: సీసీఐ పత్తికొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.