అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను పంజాబ్‌లో సృష్టించారని ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. పంజాబ్ నుంచి సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ఖాతా సృష్టించుకుని స్వాతి లక్రా పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు వివరించారు.
పది రోజుల క్రితం అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించినట్లు ఆమె దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సందేశాన్నిచ్చారు. వెంటనే ఇందుకు సంబంధించి.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పంజాబ్‌లో ఉన్నట్లు గుర్తించామని.. పోలీసులు ఓ బృందాన్ని పంపినట్లు తెలిపారు.
ఇదీ చదవండిః పోలీసుల స్నేహితులే టార్గెట్.. నమ్మించి టోకరా వేస్తున్న కేటుగాళ్లు