కరీంనగర్‌లో ఓ ఆయుర్వేద ఆస్పత్రిని ఆయుర్వేద ఆర్జేడీ డాక్టర్ రవి కుమార్ సీజ్ చేశారు. నగరంలోని ఇందిరా నగర్‌లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఆయుర్వేద ఆస్పత్రి యాజమాన్యం... నకిలీ మందులు ఇస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఓ మోకాళ్ల నొప్పుల బాధితునితో ఈ నకిలీ ఆస్పత్రి గుట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
చికిత్స అందించే వైద్యునికి ఎలాంటి డిగ్రీలు లేవని స్పష్టం చేశారు. నకిలీ మందులతో రోగులను నమ్మిస్తూ మోసం చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి వైద్యులను నమ్మవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో నకిలీ ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలోకి చొరబడిన 100 మంది నక్సలైట్లు