ETV Bharat / jagte-raho

మత్తు మందు స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి

హైదరాబాద్​ నాచారం హెచ్​ఎంటీ నగర్​లో మత్తు పదార్థాలు తయారు చేస్తున్న స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.40 లక్షల విలువైన మత్తు పదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

excise police rides on drug making centers in nacharam hmt nagar
మత్తు మందు స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి
author img

By

Published : Nov 24, 2020, 3:07 PM IST

హైదరాబాద్‌ ఉప్పల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నాచారం హెచ్​ఎంటీ నగర్​ వద్ద... మత్తు మందు తయారు చేస్తున్న స్థావరంపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా మత్తు మందు స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో ఆల్ఫ్రాజోలం అనే నార్కొటిక్ మత్తు పదార్థం తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.

సుమారు రూ.40 లక్షల విలువైన ఆల్ఫ్రాజోలం మందుతోపాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు మల్కాజిగిరి డివిజన్ ఎక్సైజ్ అధికారి ప్రదీప్ వారు తెలిపారు. కూకట్​పల్లిలో మరో స్థావరం ఉన్నట్టు విచారణలో తేలింది. నిర్వాహకులు పసుపులేటి మాణిక్యాలరావు, కోటిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మరో వ్యక్తి నెంకంటి వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి: భార్యే హంతకురాలు.. సాఫ్ట్​వేరు మర్డర్ కేసులో కొత్త కోణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.