నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.5 లక్షల విలువైన 60 బస్తాల నల్లబెల్లం, 100 కేజీల పట్టికతో పాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ ఇంటికి దగ్గరగా దొరకడం వల్ల పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లుగా బొమ్మనపల్లిలో అక్రమ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోందని స్థానికులు ఆరోపించారు.