మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వల్ల ట్రాక్టర్‌పై తరలిస్తున్న వరిగడ్డి దగ్ధమైంది. గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు వ్యవసాయ భూమి నుంచి ట్రాక్టర్ ద్వారా 70 కట్టల వరిగడ్డిని తరలిస్తున్నారు.
అయితే ఎస్సీకాలనీ వద్ద గడ్డి ట్రాక్టర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగలడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు కేకలు వేయడం వల్ల అప్రమత్తమైన డ్రైవర్ ట్రాలీని పైకెత్తి మండుతున్న గడ్డిని కిందకు పడేశారు. కాగా సుమారు రూ.10 వేల నష్టం వాటిల్లిందని బాధితరైతు అంటున్నారు.
ఇదీ చూడండి: ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన..