సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తుండగా ఓ హెల్పర్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సిబ్బంది మధ్య సమన్వయ లోపం, లైన్మెన్ నిర్లక్ష్యం వల్లే తిరుపతి ప్రాణాలు కోల్పోయాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గ్రామస్థులతో కలిసి సిద్దిపేట-హన్మకొండ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న ఏసీపీ మహేందర్, విద్యుత్ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని మృతుడి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తిరుపతి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా.. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు రహదారిపై నుంచి కదలమని భీష్మించుకు కూర్చున్నారు.
- ఇదీ చూడండి : నేను చనిపోతున్నా.. వెతకొద్దు నాన్నా...