ETV Bharat / jagte-raho

రాత్రి నిద్రిస్తుండగా పాము కాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి - Boy dies of snake bite in chinna chinthakunta mandal

నిద్రపోతున్న సమయంలో పాముకాటుకు గురై ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాత పడిన సంఘటన మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలంలో చోటు చేసుకుంది. పాము కాటు వేసిన తక్షణమే చికిత్స చేసుంటే బాలుడు బతికే వాడని గ్రామస్థులు తెలిపారు.

eight years boy died of snake bite in mahabubnagar district
మహబూబ్​నగర్​ జిల్లాలో పాముకాటుతో బాలుడు మృతి
author img

By

Published : Sep 8, 2020, 2:23 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన జగదీశ్వర్(8) సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రపోయాడు. బాలుడు నిద్రిస్తున్న సమయంలోనే తాచుపాము కాటేసినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు.

నిత్యం తమ కళ్లెదుటే తిరిగిన బాలుడు అచేతనంగా పడి ఉండటం చూసిన స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లెదుటే కన్నుమూసిన కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పాము కాటు వేసిన వెంటనే గుర్తించి వైద్య సాయం అందిస్తే బాలుడు బతికే వాడని గ్రామస్థులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.