నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం గ్రామాల్లో ఆదివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. కుక్క దాడిలో నాలుగు గేదెలకు, ఇద్దరి వ్యక్తులకు గాయాలయ్యాయి. బొప్పారం గ్రామానికి చెందిన మూటపురం మల్లయ్య (75) అనే వృద్దుడికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు.
బస్టాండ్ సమీపంలో ఒక్కసారిగా పిచ్చికుక్క ఇష్టారీతిన బాటసారులపై దాడి చేయడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే గ్రామస్థులు పిచ్చి కుక్కను కొట్టి చంపేశారు.
ఇదీ చూడండి: పిచ్చికుక్క స్వైర విహారం.. తొమ్మిది మందికి గాయాలు