ETV Bharat / jagte-raho

డీజే వ్యాన్​ బోల్తా.. ఒకరు దుర్మరణం - telangana latest news

వివాహ కార్యక్రమం కోసం వెళ్తున్న డీజే వ్యాన్​ బోల్తాపడి ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లా గొల్నేపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

accident at yadadri district
డీజే వ్యాన్​ బోల్తా.. ఒకరు దుర్మరణం
author img

By

Published : Dec 25, 2020, 2:08 PM IST

వ్యాన్​ అదుపుతప్పి బోల్తాపడింది. ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లిలో చోటుచేసుకొంది.

చిట్యాల మండలం వెలిమినేడు చెందిన యువకులు.. వలిగొండ మండలం గొల్నేపల్లిలో ఓ వివాహ బరాత్ కోసం డీజే బాక్సులను వ్యాన్​లో తీసుకెళ్లారు. గొల్నేపల్లి సమీపానికి వచ్చేసరికి వ్యాన్​ అదుపు తప్పి కాలువలో పడింది.

ఈ ప్రమాదంలో చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అరూరు మత్స్యగిరి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మిర్యాల మహేశ్​, గడ్డం మహేశ్​, గోలి అరవింద్​లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వైద్యం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: కారును ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.