ETV Bharat / jagte-raho

పెండింగ్‌ చలానా చెల్లింపులో వివాదం - పెండింగ్​ చలానా చెల్లింపు వివాదం వీర్నపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండింగ్ చలానా చెల్లింపు విషయంలో యువకులతో పోలీసులు ప్రవర్తించిన తీరు సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. పోలీసులు దుర్భాషలాడుతూ ఠాణాలోకి తీసుకెళ్లారని యువకులు ఆరోపించగా.. ఎవరిపై దురుసుగా ప్రవర్తించలేదని ఎస్సై రవీందర్​ వివరణ ఇచ్చారు.

పెండింగ్‌ చలానా చెల్లింపులో వివాదం
పెండింగ్‌ చలానా చెల్లింపులో వివాదం
author img

By

Published : Nov 14, 2020, 10:38 AM IST

పెండింగ్‌ చలానా చెల్లింపులో వివాదం

పెండింగ్‌ చలానా చెల్లింపు విషయంలో యువకులతో పోలీసులు ప్రవర్తించిన తీరు సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్‌ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం పెండింగ్‌ చలానాలకు సంబంధించిన వాహనాలను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలోనే మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ఇసుక పట్టే జాలీని తీసుకెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వాహనంపై ఉన్న పెండింగ్‌ చలానాలను చూసి కట్టాలన్నారు. గ్రామంలో చిన్న చిన్న పనులు, పంట పొలాలకు వెళ్లే వాహనాలకు జరిమానాలు ఎలా విధిస్తారంటూ రైతులు ప్రశ్నించారు. దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ యువకులు చెప్పడం వల్ల ఆగ్రహం చెందిన పోలీసు సిబ్బంది యువకులతో దుర్భాషలాడుతూ ఠాణాలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కొందరు కానిస్టేబుళ్లు చేయిచేసుకున్నారని యువకులు తెలిపారు. రెండు రోజులుగా రైతులు, చిరు వ్యాపారుల పట్ల చలానాల పేరుతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో పెండింగ్‌ చలానాలను కట్టించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని ఎస్సై రవీందర్​ వివరణ ఇచ్చారు. యువకులతోపాటు మరికొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. ఎన్‌సీసీ కేడెట్లకు జరిమానా వేస్తారా అని ప్రశ్నించారని, యువకులపై దురుసుగా ప్రవర్తించలేదని ఎస్సై వెల్లడించారు.

ఇదీ చదవండి: విచారణ నిమిత్తం పిలిస్తే.. ఆత్మహత్యకు యత్నించాడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.