హుస్సేన్ సాగర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో హుస్సేన్ సాగర్లో లేక్ పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసుకురాగా పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి నోరు పూర్తిగా తెరుచుకునే ఉండటం.. పలు అనుమానాలకు తావిస్తోంది.
చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాంగోపాల్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.