ETV Bharat / jagte-raho

'ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం' - Peddapalli District Latest News

నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి డీసీపీ రవీందర్ యాదవ్ అన్నారు. ఒక్కటి 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. జిల్లాలోని పోతారంలో సీసీ కెమెరాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు.

DCP Ravinder Yadav launching CCTV cameras
సీసీ కెమెరాలు ప్రారంభిస్తున్న డీసీపీ రవీందర్ యాదవ్
author img

By

Published : Jan 21, 2021, 1:48 PM IST

నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి డీసీపీ రవీందర్ యాదవ్ అన్నారు. జిల్లాలోని ముత్తారం మండలం పోతారంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. వ్యాపారులు, ట్రాక్టర్ యజమానులు, గ్రామ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఎస్సై నరసింహ రావు కృషిని అభినందించారు.

గ్రామంలో ఎటువంటి నేరాలు జరిగినా కెమెరాల వల్ల పోలీసుల దృష్టికి వస్తుందని డీసీపీ తెలిపారు. ప్రతీ ఊరిలో సీసీ కెమెరాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తులకు ప్రజలు సహకరించవద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

యువత సన్మార్గంలో పయనించాలి. వ్యసనాలకు బానిస కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి. ఆన్​లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. మావోయిస్టులు జన స్రవంతిలో కలిసి ఆనందంగా జీవితం గడపాలి.

-రవీందర్ యాదవ్, డీసీపీ

కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ ఆకునూరి మహేందర్, ఎస్సై ఓంకార్, ముత్తారం ఎస్సై చందా నరసింహారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సూసైడ్​​ నోట్​ రాసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.