ETV Bharat / jagte-raho

'ఆర్థిక లావాదేవీల ద్వారా నంబర్లు తీసుకుంటారు... స్వాప్​ చేసేస్తారు'

మొబైల్ నంబర్లను స్వాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. నైజీరియాలో ఉంటూ ఓ వ్యక్తి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సిమ్‌లు, నకిలీ పత్రాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

cyberabad-cp-sajjanar-about-sim-swiping-frauds
'ఆర్థిక లావాదేవీల ద్వారా నంబర్లు తీసుకుంటారు... స్వాప్​ చేసేస్తారు'
author img

By

Published : Jan 21, 2021, 12:29 PM IST

సిమ్​ స్వాప్​ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. మొబైల్​ నంబర్లను స్వాప్​ చేసి.. మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులు వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీల ద్వారా ఫోన్​ నంబర్లు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

మొబైల్​ సిమ్​లను బ్లాక్​ చేసి నిందితులు నగదును కాజేస్తున్నారని... ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతోందని సీపీ తెలిపారు. నైజీరియాలో ఉంటున్న జేమ్స్​ అనే వ్యక్తి వీరిని నడిపిస్తున్నట్లు గుర్తించామని... ఇప్పటివరకు 40 ఆధార్​ కార్డులను సీజ్​ చేశామని పేర్కొన్నారు. నిందితులు వినియోగించిన సిమ్​లు, నకిలీ పత్రాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్​ తెలిపారు.

'ఆర్థిక లావాదేవీల ద్వారా నంబర్లు తీసుకుంటారు... స్వాప్​ చేసేస్తారు'

ఇదీ చూడండి: వైద్య విద్య సీట్ల కుంభకోణం- రూ.కోట్లు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.