ETV Bharat / jagte-raho

బ్యాంక్ ఖాతాను అప్​డేట్​ చేస్తామని చెప్పి దోచేశారు - విజయవాడలో సైబర్​ నేరగాళ్లు

బ్యాంక్ ఖాతాను ఆధునికీకరిస్తామని చెప్పి.. అందినకాడికి దోచేస్తున్నారు సైబర్​ నేరగాళ్లు. ఎంతో చాకచక్యంగా ఫోన్ లోని వివరాలన్ని కాప్చర్ చేసి.. ఆపై బ్యాంక్ ఖాతాలోని నగదు మాయం చేస్తున్నారు. ఇలా ఒకరి ఖాతా నుంచి సుమారు 3 లక్షల రూపాయల మేర నగదును సైబర్ దొంగలు దోచేశారు. ఫిర్యాదు అందుకున్న సైబర్ పోలీసులు రంగంలోకి దిగి నగదు తిరిగి ఇప్పించారు.

బ్యాంక్ ఖాతా ఆధునీకరణ పేరుతో మోసం
బ్యాంక్ ఖాతా ఆధునీకరణ పేరుతో మోసం
author img

By

Published : Nov 4, 2020, 4:27 PM IST

మీ వ్యాలెట్​ను, బ్యాంక్ ఖాతాను అప్​డేట్​ చేస్తామని ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారు. ఓటీపీ పంపి నంబర్ అడుగుతారు. అటుపై ఖాతాలోని సొమ్ము మెుత్తం మాయం చేస్తున్నారు సైబర్​ నేరగాళ్లు. మరికొంతమంది టీమ్ వ్యూయర్ డౌన్ లోడ్ చేస్తే మేం మీ ఖాతా ఆధునికీకరిస్తామంటూ నమ్మించి ఫోన్​లో వివరాలన్ని కాప్చర్ చేసి.. ఆపై బ్యాంక్ ఖాతాలోని నగదు దొంగిలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలే ఏపీ విజయవాడలోని వన్ టౌన్ పరిధిలో వెలుగుచూశాయి.

వన్ టౌన్​కు చెందిన ఓ విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ ఖాతా నుంచి లక్షన్నర నగదు మాయం చేశారు. మరొకరి ఖాతా నుంచి సుమారు 3 లక్షల రూపాయల మేర నగదును సైబర్ నేరస్తులు దోచేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల పోలీసులు రంగంలోకి దిగి నిందితులు నగదును ఏవిధంగా వేరే ఖాతాల్లోకి మళ్లించారో గుర్తించారు.

వ్యాలెట్లకు నగదు మళ్లించినట్లు గుర్తించిన పోలీసులు.. సంబంధిత అధికారులకు మెయిల్ పంపారు. వ్యాలెట్లో ఉన్న నగదు సీజ్ చేసి బాధితులకు అప్పగించారు. రూ.నాలుగన్నర లక్షలు పోగొట్టుకున్న ఇద్దరు బాధితులకు 2.86 లక్షల రూపాయలు రికవరీ చేశారు. ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

బ్యాంక్ ఖాతాను అప్​డేట్​ చేస్తామని చెప్పి దోచేశారు

ఇదీ చదవండి: ఫొటోలు మార్ఫింగ్​ చేసి బ్లాక్​ మెయిల్​ చేసిన నలుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.