సైబర్ నేరస్థులు ఓ వైద్యుడిపై వలపు వల విసిరారు. ఆయన చరవాణి నంబరు తెలుసుకుని వాట్సాప్ ద్వారా ముగ్గురు యువతులు రోజూ రాత్రి వేళల్లో ఆయనతో మాట్లాడారు. మీరంటే చాలా ఇష్టమని హైదరాబాద్‌కు రావాలని ఉందంటూ ఆయనతో మాయమాటలు చెప్పారు. పడకగదిలో ఉన్నానంటూ వీడియోకాల్ ద్వారా మాట్లాడేవారు. తమ వద్ద అధిక లాభాలొచ్చే పథకాలున్నాయని, తొలుత నగదు జమ చేస్తే తర్వాత వడ్డీతో పాటు అసలు ఇస్తామని చెప్పారు.
వైద్యుడు మూడు నెలల్లో రూ.42 లక్షలు సైబర్ నేరస్థుల ఖాతాలకు పంపించారు. నగదు రాకపోడం వల్ల అనుమానం వచ్చి ఫోన్ చేయగా వారు స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన వైద్యుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు గుజరాత్‌లోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండిః పోలీసులకే టోపీలు పెడుతున్న సైబర్ కేటుగాళ్లు