హైదరాబాద్ నగరానికి చెందిన కృష్ణమూర్తి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఇండియన్ ఆయిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ కృష్ణ మూర్తికి ఫోన్ చేశారు. తమ కంపెనీకి నిత్యం అల్పాహారం సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. టెండర్‌కు పూచీకత్తు కింద రూ.78 వేలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు. నిజమేననుకున్న కృష్ణమూర్తి రూ.78 వేలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు.
కొద్ది సేపటి తర్వాత సంబంధిత నెంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. ఫలితంగా మోసపోయానని గ్రహించిన కృష్ణమూర్తి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.