క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే 12 మంది ముఠా సభ్యులను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ మండలం శనిగపురానికి చెందిన మందా సాయి, షేక్ పాషా, షేక్ మీరా, గుగులోత్ రమేశ్, మహబూబాబాద్ పట్టణానికి చెందిన రాపోలు శ్రీనివాస్, నిమ్మరబోయిన వెంకటేశ్, రేసు శ్రీధర్, కుక్కల సతీష్, మల్లం వంశీకృష్ణ , మరిపెడకు చెందిన ఉడుగుల రాజు, ఉప్పల సతీష్, సంగెం భరత్‌ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
జనగాం సాయి, మనోజ్ రెడ్డి పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి నుంచి లక్ష రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. క్రికెట్ అంటే అందరికీ అభిమానమేనని, ఒకవైపు పు యువత చరవాణిలో అతుక్కపోతూ... మరోవైపు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్నారు.
పట్టణాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ సంస్కృతి నేడు గ్రామాలకు కూడా వ్యాపించిందన్నారు. నిమిషాల్లో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయని... బెట్టింగ్ ఉచ్చుల్లో పడి యువత, చిరువ్యాపారులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. డబ్బులు దొరకని పరిస్థితుల్లో దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్‌కు పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య