ETV Bharat / jagte-raho

స్నేహితుడి కోసం సస్పెండ్ అయిన కానిస్టేబుల్ - కానిస్టేబుల్ సస్పెండ్

స్నేహితుడితో వివాదం పెట్టుకున్న వ్యక్తిని ఎలాగైనా పోలీసులకు పట్టించాలని ఓ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. కానీ చివరికి సీసీ కెమెరాలు అతనిని పట్టించేయడంతో సస్పెన్షన్​కు గురయ్యాడు. ఇంతకీ అతను ఏమి చేశాడంటే...

constable-suspended-in-tappachabutra-in-asif-nagar
స్నేహితుడి కోసం... సస్పెండ్ అయిన కానిస్టేబుల్
author img

By

Published : Nov 20, 2020, 11:26 AM IST

స్నేహితుడి శత్రువును పోలీసులకు పట్టించేందుకు ఓ కానిస్టేబుల్ వక్రమార్గం పట్టాడు. గంజాయి పొట్లాలను శత్రువు బైకులో ఉంచి అధికారులకు పట్టించేందుకు యత్నించాడు. ఆసిఫ్​నగర్​ డివిజన్​లోని టప్పాచబుత్ర ఠాణాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్​కు ఓ స్నేహితుడు ఉన్నాడు. అతనికి మరో వ్యక్తితో వివాదం ఉంది. స్నేహితుడికి సాయం చేయాలని భావించిన కానిస్టేబుల్ రహస్యంగా గంజాయిని తీసుకువచ్చాడు. వివాదమున్న వ్యక్తి అంబా థియేటర్​ వద్ద ఉన్నాడని తెలిసి... అక్కడికి వెళ్లి గంజాయిని శత్రువు బైక్​లో ఉంచాడు. అనంతరం ఇన్​స్పెక్టర్​కి ఫోన్​ చేసి... ఆ వ్యక్తి వద్ద గంజాయిని ఉందని తెలిపాడు. సీసీ కెమెరాలు పరిశీలించగా కానిస్టేబుల్ వ్యవహారం బయటపడింది.

ఇదీ చూడండి: ఘరానా మోసం: బంగారం తాకట్టు పెడితే గోల్డ్​ కాయిన్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.