ETV Bharat / jagte-raho

పెట్రోల్​ పోసుకొని కాంగ్రెస్​ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.. - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్ పాతబస్తీ లలితాబాగ్ డివిజన్​ కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ అబ్దుల్ ఇర్ఫాన్ పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. భాజపా, తెరాస, ఎంఐఎం అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. రిటర్నింగ్​ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయాడు.

suicide
పెట్రోల్​ పోసుకొని కాంగ్రెస్​ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..
author img

By

Published : Nov 25, 2020, 12:22 PM IST

హైదరాబాద్ పాతబస్తీ లలితాబాగ్ డివిజన్​ కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ అబ్దుల్ ఇర్ఫాన్ ఆత్మహత్యకు యత్నించారు. నర్కి ఫుల్​బాగ్​లోని జీహెచ్​ఎంసీ కార్యాలయం లోపల పెట్రోల్​ పోసుకొని బలవన్మరణానికి యత్నించారు.

లలితాబాగ్​ డివిజన్​లో తనను ప్రచారం చేయనీయకుండా తెరాస, భాజపా, ఎంఐఎం అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈనెల 21న రిటర్నింగ్​ అధికారికి ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. భవానినగర్​ ఇన్​స్పెక్టర్​ ప్రచారం చేయనివ్వకుండా అనుమతులు సక్రమంగా లేవని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్​ స్లిప్పులు పంపిణీ చేయకుండా.. ఇతర అభ్యర్థులకు ఇచ్చారని ఆరోపించారు.

తనకు రిటర్నింగ్ అధికారి కూడా సహకరించడం లేదని, అనుమతుల కోసం గంటల తరబడి వేచిచూసేలా చేసున్నాడని వాపోయాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు ఘటన స్థలికి చేరుకొని.. అభ్యర్థిని ఠాణాకు తరలించారు. చంద్రాయణగుట్ట సర్కిల్​ జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్, తెరాస, భాజపా, ఎంఐఎం, రిటర్నింగ్​ అధికారి​పై.. కాంగ్రెస్​ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెట్రోల్​ పోసుకొని కాంగ్రెస్​ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..

ఇవీచూడండి: బండి సంజయ్​ సర్జికల్‌ స్ట్రైక్‌ వ్యాఖ్యలతో దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.