సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీకలనాయక్ తండాలో శనివారం రాత్రి సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. డీఎస్పీ రఘు, కోదాడ రూరల్ సీఐ శివరామిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముందస్తు చర్యగా పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!