ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో ఓ కంపెనీలో కేబుళ్లను కత్తిరించి నష్టానికి కారణమైన చైనా ఇంజినీర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాక్స్ లింక్స్ ఇన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో యంత్రాలు అమర్చేందుకు ఫాంగ్ చెంజిజ్ అనే ఇంజినీరు చైనా నుంచి వచ్చాడు.
యంత్రాలు బిగించే సమయంలో వాటిలోని విలువైన కేబుళ్లను కత్తిరించినట్లు కంపెనీ నిర్వాహకులు గుర్తించారు. సంస్థకు రూ. 10 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఈనెల 21న ఏర్పేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో చైనా కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకే ఈ తప్పిదానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: ఒక్కసారైనా సొనాల 'రైతు వేదిక' చూడాల్సిందే..!