ETV Bharat / jagte-raho

కరోనా ఎఫెక్ట్ : పసుపు తాడు బంధనంలో చిన్నారులు - child marriages during lockdown

కరోనా మహమ్మారి గిరిజన చిన్నారుల పట్ల శాపంగా మారింది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలలు మూతపడటం వల్ల పిల్లలు ఇంటి పట్టునే ఉంటున్నారు. గిరిజనులు నిరక్ష్యరాస్యత వల్ల ముక్కుపచ్చలారని పసిపిల్లల మెడకు పసుపు తాడు బిగిస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థంగాక బాల్య వివాహానికి బంధీ అవుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. రహస్యంగా చిన్నారులకు బాల్యవివాహాలు చేస్తున్నారు.

child marriages are increasing during lockdown
పసుపు తాడు బంధనంలో చిన్నారులు
author img

By

Published : Jan 3, 2021, 2:31 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం మున్సిపాలిటీ పరిధిలోని పలు తండాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యవివాహాలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. సమాచారం రాగానే బాలల పరిరక్షణ, ఐసీడీఎస్​, రెవెన్యూ, చైల్డ్​లైన్ అధికారులతో కలిసి తండాకు చేరుకున్నారు. అధికారులు వెళ్లేసరికి వారు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.

వివాహతంతు జరిపించడానికి వెళ్లిన పురోహితులకు ఫోన్​ చేసి పోలీసులు ఘటనపై ఆరా తీశారు. కల్యాణ ముహూర్తం నిర్ణయించే ముందు వయసు ధ్రువీకరణ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూడాలని, 18 ఏళ్లు దాటకుండా అమ్మాయికి, 21 ఏళ్ల రాని అబ్బాయికి పెళ్లి జరిపించాలని చూస్తే వారి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.

డిసెంబర్ నెలలోనే వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఇందులో వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోనే 7 బాల్య వివాహాలను ఆపారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక యువత, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు బాల్య వివాహాల నిరోధానికి సహకరించాలని జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.