ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడి చేతులో మోసపోయిన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో చోటుచేసుకుంది. బాలిక(16) తండ్రి ప్రైవేటు వాహన డ్రైవర్. తల్లి గృహిణి. బాలిక పదోతరగతి చదువుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు కావడంతో ఇంటి వద్దనే ఉంటుంది.
అదే గ్రామానికి చెందిన యువకుడు(20) బాలిక వద్ద నిన్ను ప్రేమిస్తున్నానని... మా ఇంట్లో అవునన్నా కాదన్నా నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు మొదట్లో అతని ప్రేమను తిరస్కరించింది. అయినా పట్టుపడి వెంటపడ్డాడు. ఒకే ఊరు కులాలు సైతం ఒక్కటే కావడంతో యువకుడి ప్రేమను ఒప్పకుంది. ఓ రోజు తాను ప్రేమించినవాడే కదా రమ్మంటున్నాడని అతను చెప్పిన చోటికి వెళ్లింది. ఫలితంగా బాలిక గర్భవతి అయింది.
కొన్ని రోజులకు బాలిక శరీరంలో భారీ మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. వైద్యులకు చూపించారు. నాలుగు నెలల గర్భవతి అని తెలింది. ప్రేమించి ప్రేమ పేరిట గర్భవతిని చేసిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని బాలిక వేడుకుంది. అందుకు ఒప్పుకున్నాడు. అయితే యువకుడి ఇంట్లో పెళ్లికి ఒప్పకోలేదు. ప్రేమ పేరిట మోసపోయానని గ్రహించిన బాలిక ఈనెల 21న మధ్యాహ్నం ఇంట్లో యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో ఈనెల 22న మృతి చెందింది.
వివరాలు సేకరించిన పోలీసులు మీడియాకు తెలియకూడా రహస్యంగా ఉంచడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక ఆత్మహత్యపై ఘట్‌కేసర్ ఠాణా ఎస్‌హెచ్‌వో ఎన్.చంద్రబాబును 'ఈటీవీ భారత్' ప్రతినిధి ప్రశ్నించగా.. బాలికను ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్యకు చేసుకుందని చెప్పారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో మీడియాకు చెప్పడం కష్టమన్నారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ తక్షణమే ఎన్నికలకు సిద్ధం కావాలి: బండి