ETV Bharat / jagte-raho

చైన్​ స్నాచర్​ అరెస్ట్​... రెండు లక్షల ఆభరణాలు స్వాధీనం

మహిళ మెడలలో నుంచి విలువైన బంగారు ఆభరణాలు దోచుకుంటున్న దొంగను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి 4 తులాల బంగారు ఆభరణాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

చైన్​ స్నాచర్​ అరెస్ట్​... రెండు లక్షల ఆభరణాలు స్వాధీనం
చైన్​ స్నాచర్​ అరెస్ట్​... రెండు లక్షల ఆభరణాలు స్వాధీనం
author img

By

Published : Oct 21, 2020, 8:43 PM IST

నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసు చోరీకి పాల్పడిన దొంగను హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న సాయంకాలం రాజేశ్వరి అనే వివాహిత నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆటోలో వచ్చిన దొంగ మెడలోని గొలుసు తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా... అనుమానం వచ్చిన ఓ ఆటో డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తమదైన శైలిలో విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. వనపర్తి జిల్లాకు చెందిన కెతావత్ శంకర్ ఆటో నడుపుతూ మియాపూర్​లో నివాసం ఉంటున్నాడు. శంకర్ జల్సాలకు, కుటుంబ ఖర్చులకు డబ్బులు సరిపోకపోవటం వల్ల చైన్ స్నాచింగులకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి.. రెండు లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు.

ఇదీ చూడండి: భారీ వర్షాలతో రోడ్లు చిన్నాభిన్నం...ప్రయాణం నరకప్రాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.